రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున ‘బ్రూస్‌లీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కెరాఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి. తమ్ముడు సినిమాతో పవన్‌కల్యాణ్ చిరంజీవి సరసన చేరిపొయాడు. బన్ని కూడా ఎంటర్‌టైన్‌మెంట్ పండించటంలో గ్రిప్ సాధిస్తున్నాడు. చరణ్ మాత్రం ఇప్పటి వరకు ఆ ప్రయత్నమే చెయ్యలేదు.
దర్శకుడు శ్రీనువైట్ల మాస్ ప్రేక్షకులకు కావాల్సిన యాక్షన్ మిస్ చెయ్యకుండా ఎంటర్‌టైన్‌మెంట్ పండించటంలో దిట్ట. రామ్‌చరణ్‌ను పక్కన పెట్టి బ్రహ్మానందంతో లాగించేస్తాడా, రామ్‌చరణ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ కోణం బయటకు తీస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన యాక్షన్ టీజర్, పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫ్యామిలీ సెంటిమెంట్ టీజర్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచేశాయి. కొందరు జనాలు మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు.
idlebrain jeevi @idlebrainjeevi Aug 21
#RC9. It’s a good action teaser. But I am looking for entertainment oriented trailer in the days to come!
httpv://youtu.be/UI4cOA5z66E