గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ – మెగా హిరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న కంచె మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి, సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అల్లరి నరేష్, మంచు లక్ష్మి, దేవిశ్రీప్రసాద్, హీరోయిన్ తాప్సీతో పాటు పలవురు సాంకేతికి నిపుణులతో పాటు ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు వస్తున్నాయి. ట్రైలర్ ఎక్స్‌లెంట్ అని సినిమా ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదని ..తాము కంచె సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామంటూ వారంతా చెపుతున్నారు.
రొటీన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే వైవిధ్యమైన కథ, కథనంతో పాటు ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న కంచె పీరియడ్ ఫిలిం.
ట్రైలర్‌తో ఇంతమంది ప్రశంసలు అందుకుంటున్న కంచె కమర్షియల్ విజయం సాధించి, మరిన్ని వైవిధ్యమైన సినిమాలు రావడానికి దర్శకుడుకి ఎనర్జీ ఇస్తుందా? అనేది తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.