హరీష్‌శంకర్ గబ్బర్‌సింగ్ సినిమాతో టాప్ డైరక్టర్స్‌లో ఒకడిగా నిలిచాడు. రామయ్యా వస్తావయ్యా కూడా హిట్ అయ్యి వుంటే, టాప్ 3 లో వుండేవాడు. ఆ సినిమా అనుకున్నంత హిట్ కాకపొయినా, ఎన్.టి.ఆర్ ను సరికొత్తగా చూపించడని మాత్రం హరీష్‌శంకర్ ఎన్.టి.ఆర్ అభిమానులకు దగ్గరయ్యాడు.
మెగాఫ్యామిలి నుంచి వచ్చిన ఏ హిరోకు ఇబ్బందులు లేవు. కాకపొతే “మీ ఫ్యామిలి నుంచి ఎంతమంది వస్తారా” అని విమర్శలు ఎదుర్కొన్న మెగా హిరో సాయి ధర్మ్ తేజ్. విమర్శలు చేసిన వాళ్ళందరికీ “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో సరప్రైజ్‌గా నిలిచాడు. నెక్స్ట్ మెగాస్టార్‌గా దూసుకుపొయే మెగాస్టార్ పొలికలు వున్నాయి.
వీరిద్దరిని తీసుకొని శ్రీవెంకటేశ్వర్రకియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా నిర్మిస్తున్న “సుబ్రమణ్యం ఫర్ సేల్” సెప్టెంబర్ 24 న రిలీజ్ అవుతోంది. మంచి టాక్ వస్తే అమెరికాలో 1 మిలియన్ మూవీ అయ్యే సూచనలు వున్నాయి. “సుబ్రమణ్యం ఫర్ సేల్” టీం అమెరికా వచ్చి ప్రి రిలీజ్ పబ్లిసిటి చేయగల్గితే, టాక్‌తో సంబంధం లేకుండానే 1 మిలియన్ మూవీ అవుతుంది.