పవన్‌కల్యాణ్‌కు సెల్ఫ్‌డబ్బా ఎక్కువైంది

pawanfans

మొన్న ఆంధ్రజ్యోతిలో పవన్‌కల్యాణ్ వెంటపడేది ఎక్కువగా కాపు యువత అంటే “నా ఒక ఆడపిల్లకు గుడిలో నామకరణం చేసా .. ఒక ఆడపిల్లకు చర్చ్‌లో నామకరణం చేసా .. నేను కులమతాలకు ఆతీతుడిని” అంటూ ఆంధ్రజ్యోతిలో వ్రాసిన పాయింట్‌కు సంబంధం లేకుండా సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్నాడు.

ఇప్పుడు భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు జరిగిన గొడవలో, “బలహీనులకు అన్యాయం జరుగుతుంది” స్పందించమంటే “భౌతిక దాడులకు తాను వ్యతిరేకినని వర్గ వైషమ్యాలు, కులమత వివాదాలు కూడదని” అంటున్నాడు.

ఇక్కడ గొడవకు కులం కంపు వున్న మాట వాస్తవమే. సమస్యను ఒక కోణంలోంచే చూసి పవన్ అభిమానులకే క్లాస్ పీకటం దారుణం. నిజంగా కులంకు సంబంధించిన సమస్యే అయితే యం.ఎల్.ఎ పవన్‌ఫ్యాన్స్ వైపు మాట్లాడాలి. ఈయన ప్రభాస్ ఫ్యాన్స్ వైపు మాట్లాడుతున్నాడు.

పవన్‌కల్యాణ్‌కు మాత్రమే కాదు, ఏ మనిషికి వ్యక్తిగతంగా కులగజ్జి వుండదు. నలుగురు కలిస్తేనే, మన తెలుగోడురో, మన ఇండియావోడురో, మన జిల్లావోడురో, మన వూరోడురో .. ఒక వూళ్ళో ఒకే కులం వుంటే, ఆ కులంలోనే కొట్టుకుచస్తారు. దురదృష్టం ఏమిటంటే, పైకి మాత్రం ఇక్కడ కుల కంపు వుంది. అంతర్లీనంగా నిజానికి ఇది:

  1. బలహీనులపై బలవంతుల దౌర్జన్యం
  2. పేదవారిపై ధనవంతుల అహంకారం
  3. అధికారంతో విచ్చలివిడితనం

idlebrain jeevi
Pawan Kalyan and Prabhas are very few of Telugu stars who doesn’t care about records. Why fans fight in Bhimavaram!

క్షణికావేశంలో పవన్‌ఫ్యాన్స్ శృతిమించారు. కాకపొతే అటువైపు నుంచి కూడా చాలా తప్పు వుంది. ఈ పనికిమాలిన గొడవల్లోకి ఎంతో మంచివాడుగా పేరున్న ప్రభాస్‌ను, కులమతాలకు ఆతీతం అని సెల్ఫ్‌డబ్బా కొట్టుకునే పవన్‌కల్యాణ్‌ను లాగటం తప్పు. ఇరువర్గాలను హెచ్చరించాలి తప్ప, ఒక వర్గానికి శిక్ష వెయ్యడం వాళ్ళు చేసిన దానికంటే పెద్ద తప్పు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Pawan Kalyan. Bookmark the permalink.