రాంగోపాలవర్మ ఒక జీనియస్. ఎంత జీనియస్సో, అంతే క్లియర్ కట్‌గా ఎక్సప్రెస్ చెయ్యగలడు. నిజాలకు అబద్ధాలు జోడించి మిడియాను తప్పుద్రోవ పట్టించడంలో దిట్ట. మిడీయాకు మంచి న్యూస్ ఫీడర్. బాహుబలిపై ప్రశంసలు కురిపిస్తూనే, అవకాశం దొరికితే ఎవరికి అర్దం కాని విధంగా ఈర్ష్యను వెళ్ళగక్కుతుంటాడని ఆయన ఫాలోయర్స్ అనుకుంటూ వుంటారు. మిడియా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మలచుకొని వ్రాసేసుకుంటూ వుంటారు.
రాజమౌళిని జనాల చేత ఏ విధంగా తిట్టిద్దాం అని రాజమౌళి మీద ఏం కామెంట్ చేద్దామా అనుకుంటున్న ఆయనకు రాజమౌళి ఇంటిపేరు గుర్తుకొచ్చింది. ఎస్ఎస్ అంటే.. స్టీఫెన్ స్పీల్బెర్గ్ అంటూ ఓ కొత్త సిద్ధాంతం తెచ్చిపెట్టారు. తనకు ఈ విషయం ఇప్పుడే తెలిసిందంటూ ట్విట్టర్లో రాసిపారేశారు.
రాంగోపాలవర్మ మనసులోని మాటను గ్రహించిన రాజమౌళి ”జనంతో నన్ను తిట్టించడానికి కాకపోతే అవసరమా సర్ ఇప్పుడిది” అంటూ ఆయనకు సమాధానం పెట్టారు.
రాంగోపాలవర్మ లాస్ట్ పంచ్ కిక్ కోసం “నీ అతి వినయం తట్టుకొలేక పొతున్నాను .. నువ్వే గెలిచావ్” అని డైరక్ట్‌గా పొగుడుతున్నట్టుగా దొబ్బులెట్టాడు.