విలక్షణ సినిమాల దర్శకుడు క్రిష్ & మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ‘కంచె’ పేరుతో రూపొందుతోన్న సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక బలమైన ఎమోషన్‌ను చూపించే క్రిష్, ‘కంచె’ సినిమాను రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథకు ముడిపెట్టి తెరకెక్కించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు. సెప్టెంబర్ 17వ తేదీన హైద్రాబాద్‌లో ‘కంచె’ ఆడియోను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు సైతం కొనియాడారు. ఈ పంక్షన్ కు రామ్‌చరణ్ గెస్ట్ గా హాజరు అవుతారని తెలుస్తోంది.
మాస్ హిరోగా రఫ్ ఆడించాలన్న మెగా అభిమానుల కోరికకు భిన్నంగా క్లాస్ డైరక్టర్స్ ఓరింటడ్ మూవీస్లో చేస్తూ వస్తున్నాడు వరుణ్ తేజ్.
httpv://youtu.be/UqhrfKnAfnQ