రామ్‌చరణ్ చేతుల మీదగా కంచె ఆడియో

Krish-Kanche

idlebrain jeevi ‏
Ram Charan to do honors #Kanche music launch

వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కంచె ‘. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి విలక్షణ చిత్రాలతో టాలీవుడ్ లోనే కాకుండా రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ‘గబ్బర్’ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఈయన దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మాతలుగా ఈ ‘కంచె’ చిత్రం ప్రతిష్టాత్మంగా రూపొందుతోంది.

ఈ వినాయకచవితి సందర్భంగా ‘కంచె’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో సెప్టెంబర్ 17 వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. అలాగే సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.
అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తం గా ‘కంచె’ చిత్రం విదుదల అవుతుంది. వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలురాయి గా నిలుస్తుంది. కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చునని దర్శకుడు క్రిష్ తెలిజేశారు. 1940 నేపథ్యంలో సాగే ఈ కథ ను మానవీయ విలువలతో దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు .

‘కంచె’ చిత్రం లోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అధ్భుతంగా రచించారని నిర్మాతలు రాజీవ్ రెడ్ది మరియు జాగర్లమూడి సాయిబాబు తెలిపారు.ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. భారీవ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగుసినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు.

నికితన్ ధీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాస్,పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అనూప్ పూరి, మెరీనా టారా ఇతర తారాగణంగా నటిస్తోన్నఈ చిత్రానికి కొరియోగ్రఫీ: బృంద, స్టంట్స్: వెంకట్, డేవిడ్ కుబువా, ఎడిటర్స్: సూరజ్ జగ్ తాప్, రామకృష్ణ అర్రమ్, ఆర్ట్: సాహి సురేష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,సాహిత్యం: సీతారామశాస్త్రి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జ్ఞాన‌శేఖ‌ర్‌, మ్యూజిక్: చిరంతన్ భట్ ,నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె. Bookmark the permalink.