సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే అక్టోబర్ 15న రిలీజ్ అని ఎనౌన్స్ చేసిన మూవీ రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’. కొన్ని రోజుల క్రితం ఆ డేట్‌కు వస్తుందా అనే డౌట్స్ చాలా వచ్చాయి. ఎందుకంటే చాలా వర్క్ పెండింగ్ వుండటంతో పాటు అఖిల్ సినిమా అక్టోబర్ 23 అని ఎనౌన్స్ చేసారు. ఒక వారం గ్యాప్‌లో రెండు భారీ సినిమాలు వుంటాయా అనే ధీమాతో బ్రూస్‌లీ రాదు అనే టాక్ మొదలయ్యింది. ఆ అనుమానలకు ఫుల్‌స్టాఫ్ పెడుతూ ‘బ్రూస్ లీ’ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుందని రామ్ చరణ్ తెలిపాడు. దసరా కానుకగా ‘బ్రూస్ లీ’ని అభిమానుల మందుకు తీసుకురానున్నామని రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. ఫైట్ మాస్టర్ గా అభిమానులను అలరిస్తానని రామ్ చరణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
పవన్‌కల్యాణ్ చేతుల మీదగా ‘బ్రూస్ లీ’ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 26న జరుగనున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకుడు. కాగా, రాంచరణ్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, చిరంజీవి ప్రత్యేక పాత్రలో ఓ పాటకు స్టెప్పులు వేయనున్నట్టు సమాచారం. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ అభిమానులకు ఇది డబుల్ కిక్ లభిస్తుందనడంలో సందేహం లేదు. అమెరికా 3 మిలియన్స్ మూవీ అవుతుందని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.