సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు.
నటీనటులు :
సాయిధరమ్‌తేజ్, రెజినా, అదాశర్మ, సుమన్, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావురమేష్, పృథ్వి, ప్రభాస్ శ్రీను తదితరులు.
సంగీతం: మిక్కీ జె.మేయర్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటింగ్: గౌతంరాజు
ఫైట్స్: రామ్‌లక్ష్మణ్,వెంకట్
ఆర్ట్: రామకృష్ణ
స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్
కో-ప్రొడ్యూసర్స్: శిరీష్, లక్ష్మణ్
నిర్మాత: దిల్‌రాజు
కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
ఇండియాలో మెగా ముద్రతో పాటు “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో సక్సఫుల్ హిరో అనిపించుకున్నాడు కాబట్టి “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా ఎలా వున్నా మినిమమ్ కలక్షన్స్ ఖాయం.
- సక్సస్‌ఫుల్ మెగా హిరో సాయిధరమ్‌తేజ్
- కథను కరెక్టుగా జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న నిర్మాత ‘దిల్’ రాజు
- చురుకైన, పదునైన హీరోయిజాన్ని ఎంటర్‌టైనింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో హరీశ్‌శంకర్ స్పెషలిస్టు
వున్నా కాని “సుబ్రమణ్యం ఫర్ సేల్” అమెరికా కలక్షన్స్ వెబ్ రివ్యూస్ మీదే పూర్తిగా ఆధారపడే వున్నాయంటున్నారు. “భలే భలే మగాడివోయ్” & “శ్రీమంతుడు” సినిమాలకు మంచి పాజిటివ్ వెబ్ రివ్యూస్ ఆ సినిమాల అమెరికా కలక్షన్స్‌కు బాగా ఉపయోగపడ్డాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, మెగా ముద్రతో అమెరికాలో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించడం చాలా ఈజీ అంటున్నారు ట్రేడ్ పండితులు.