వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘డిక్టేటర్’ ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ తో పాటు Motion poster కూడా రిలీజ్ చేసారు. నందమూరి అభిమానులు పండగ చేసుకొనేలా వుంటే, చిరంజీవి అభిమానులు చిరంజీవి 150వ సినిమా కోసం ఎదురుచూసేలా వుంది ఈ పోస్టర్. విద్యుత్ ధగ ధగలాడే గదిలో సూటు, బూటు ధరించిన బాలయ్య పెద్ద కూర్చీలో ఠీవిగా కూర్చుని ఆకాశంవైపు చూస్తున్నట్టు పోస్టర్ లో ఉంది. ‘డిక్టేటర్’కు ఒక పక్క గ్లోబు, మరొపక్క గుర్రం ప్రతిమ ఉంది. బాలకృష్ణ 99వ సినిమా కావడంతో ఈ చిత్రం విడుదల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా అంజలి, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. కోన వెంకట్, గోపీమోమహన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. శ్రీధర్ సీపాన, ఎం రత్నం మాటలు రాస్తున్నారు.
httpv://youtu.be/de2BPWJSxKc