సుబ్రమణ్యం ఫర్ సేల్ – పాత కథే

Subramanyam for Sale

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ రూపొందించిన ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, అదా శర్మ హీరోయిన్లు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు అందించారు. ఈ సినిమా పాత కథే అయినా, సాయిధర్మ్‌తేజ్‌కు మాత్రం కొత్త కథ “ఇంతకుముందు వచ్చిన పాయింట్‌కే ఒక థ్రిల్లింగ్‌ పాయింట్‌ యాడ్‌ చేసి ఈ చిత్రం చేశాను” అని అంటున్నాడు దర్శకుడు హరీష్‌శంకర్.

GreatAndhra.com: సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’.. ‘మొగుడు కావాలి’, ‘బావగారు బాగున్నారా’ టైప్‌ మూవీ అని టాక్‌ వినిపిస్తోంది. అది నిజమేనా?

హరీష్‌: అది నిజమనీ చెప్పలేను, నిజం కాదనీ చెప్పలేను. ఇది కొత్త కథ అని నేను చెప్పను. అలా అని కొత్తగా అనిపించదు అని కూడా అనను. ఇది తేజ్‌కి కొత్త సినిమా. ఇందులో తేజ్‌ కొత్తగా అనిపిస్తాడు. నేను చెప్పేదేంటంటే.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తర్వాత ఇందులో ఇక కొత్తదనం ఏముంది అని చిరంజీవిగారు అనుకుని ఉంటే మనం ‘ఇంద్ర’ మిస్‌ అయ్యేవాళ్లం. చిరంజీవిగారికి ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కొత్త కాబట్టి అది చూసి మనమందరం ఎక్సయిట్‌ అయ్యాం. భారతీయుడు సినిమాలో లంచం గురించి శంకర్‌ అంత గట్టిగా చెప్పినప్పుడు, అది అన్ని భాషల్లో అంతగా సక్సెస్‌ అయినప్పుడు మళ్లీ మనం లంచం గురించిన సినిమా ఎందుకు చేయాలని అనుకుని ఉంటే ‘ఠాగూర్‌’ మిస్‌ అయిపోయే వాళ్లం. చిరంజీవిగారు అంతకు ముందెప్పుడూ ఆ పాయింట్‌ టచ్‌ చేయలేదు. కాబట్టి ఆయనకి అది కొత్త. అలా ఈ సినిమాలో మీరు చెప్పిన ఎగ్జాక్ట్‌ సినిమాల్లోని పాయింట్‌ ఉండొచ్చు, లేకపోవచ్చు… రిలీజ్‌కి ముందు కనుక నేను కొన్ని విషయాలు రివీల్‌ చేయలేను. కానీ ఒకటైతే చెప్తాను. ఇంతకుముందు వచ్చిన పాయింట్‌కే ఒక థ్రిల్లింగ్‌ పాయింట్‌ యాడ్‌ చేసి ఈ చిత్రం చేశాను. ట్రీట్‌మెంట్‌ పరంగా ఈ చిత్రం హండ్రెడ్‌ పర్సెంట్‌ కొత్తగా ఉంటుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సుబ్రమణ్యం ఫర్ సేల్, Featured. Bookmark the permalink.