సాయి ధరమ్ తేజ్, రెజీనా జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర మూవీస్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వినాయక చవితి సందర్భంగా ప్రి రిలీజ్ ప్రమోషన్ అదిరిపోయింది. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు లైనులో వుండటం వలన, సినిమా అభిమానులందరూ మంచి ఉత్సాహంతో వున్నారు. ఈ సినిమా ముందు రావడం కచ్చితంగా ఈ సినిమాకు ఎడ్వాటేంజ్.దిల్ రాజు నిర్మాత కావడంతో భారీ ఓపినింగ్స్‌కు భారీ రిలీజ్ సిద్దం అయిపోయింది.
అంతే కాదు, సినిమా కథ మీద కూడా ప్రేక్షకులకు అవగాహన కలిపించేసారు. “డబ్బులు కోసం ఏమైనా చేసే సుబ్రమణ్యం, హిరోయిన్‌కు మొగుడిగా హిరోయిన్ ఇంట్లో ప్రవేశిం నవరసాలు ఎలా పండిస్తాడన్నదే ఈ సినిమా కథ” అనే భావనలో సినిమా ప్రేక్షకులు వున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ స్కోప్ వున్న సినిమాగా ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఇండియాలో మంచి కమర్షియల్ హిట్ అవుతుందని గ్యారంటీ వున్నా, అమెరికాలో ఎంత కలక్షన్స్ సాధిస్తుందనే దానిమీదే అందరి చూపులు వున్నాయి ఇప్పుడు. ఇంకో వారం అంతే.