మైకు దొరికితే చాలా మందికి పూనకం వస్తుంది. పర్సనల్‌గా చెప్పవలసిన విషయాలు మైకులో చెప్పి హిరోలకే హిరోలయిపొదాం అని ఫీల్ అయిపొతూ వుంటారు. రాజమౌళి కూడా ఈ మధ్య మైకు దొరికితే హిరోలకు కూడా క్లాసులు మీద క్లాసులు పీకే ప్రయత్నం చేస్తున్నాడు. రాజమౌళి కష్టపడతాడు, ప్రేక్షకులకు ఏది కావాలో అది ఇస్తున్నాడు కాబట్టి సక్సస్ బాటలో వున్నాడు. అలా కాకుండా ప్రేక్షకులను ఉద్దరిద్దాం అనుకున్న రోజు లేదా “నా ఇష్టం వచ్చినట్టు తీస్తాను, చూస్తే చూడండి లేదా చూడకండి” అనుకున్న రోజు రాజమౌళి పెట్టే బడ్జెట్‌కు నిర్మాతల పరిస్థితి ఏమిటో రాంగోపాలవర్మకు బాగా తెలుసు.
కంచె ట్రైలర్ రిలీజ్ అప్పుడు మాట్లాడిన మాటలకు దర్శకుడు క్రిష్ కంచె ఆడియో ఫంక్షన్‌కు దూరం పెడితే, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ వినాయక్ సినిమాకు కూడా పిలవలేదంటే రాజమౌళి పీకే క్లాసులకు వారసులు ఎంత భయపడిపొతున్నారో అర్దం చేసుకొవచ్చు.
bottomline:
1) సినిమా ఫ్యామిలిలో పుట్టడం శాపం కాదు
2) సక్సస్‌కు ఫార్ములా లేదు. ఎవరికుండే పరుధులను బట్ట & వారికొచ్చే అవకాశాలను బట్టి వారి వారి ప్రయత్నాలు చేస్తూ వుంటారు