- మెగాస్టార్ అనే బిరుదుకు 100% న్యాయం చేసిన హిరో మన అన్నయ్య చిరంజీవి
- అన్నయ్యకు తగ్గ తమ్ముడు అని మాత్రమే కాదు తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పర్చుకొని “పవర్‌స్టార్” అయ్యాడు మన పవన్‌కల్యాణ్
- స్టైలిష్ స్టార్ అవ్వాలనుకొని ఒక టార్గెట్ సెట్ చేసుకొని 24X7 కష్టపడుతున్న హిరో బన్నీ
- చిరుతనయుడిగా తన మొదటిసినిమాతోనే మెగాపవర్ స్టార్ అయిపొయాడు మన చరణ్. మెగాపవర్ స్టార్ తనకు ఇష్టం వుందో తెలియదు కాని, అభిమానులే అలా అడ్రస్ చెయ్యడం వలన అదే ఫిక్స్ అయిపొయింది.
మెగాఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో స్టార్ వచ్చాడు. తన మొదటి సినిమా కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, ప్రేక్షకుల మన్నలను కూడా పొందాడు. అతనే మెగా మేనల్లుడు “సాయి ధర్మ్ తేజ్”.
పాత సినిమాలో చిరంజీవిలా అనిపిస్తున్న సాయి ధర్మ్ తేజ్ కు పవన్‌కల్యాణ్ ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి. గబ్బర్‌సింగ్‌తో పవన్‌కల్యాణ్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చిన హరీష్‌శంకర్ సినిమా చెయ్యడానికి గల కారణం కూడా అదే.
సాయిధర్మతేజ్, రెజినా జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపోందిన చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆడియో ఎక్సపెటేషన్స్ రీచ్ కాకపొయినా ఈచిత్రంపై ఫుల్ పాజిటివ్ ప్రి రిలీజ్ టాక్ వుండటం విశేషం.