మగధీర తర్వాత మంచి హైప్‌తో రిలీజ్ అవుతున్న చరణ్ సినిమా బ్రూస్‌లీ. మగధీర సినిమా మీద కూడా, హైప్ ఆడియో ఫంక్షన్ తర్వాత వచ్చింది. “రచ్చ” “నాయక్” & “ఎవడు” సినిమాలు ఒకే మూసలో సాగినా, అంత హైప్‌తో రిలీజ్ కాకపొయినా, మాస్‌లో చరణ్ రేంజ్‌ను బాగా పెంచాయి. ఆ తర్వాత వచ్చిన “గోవిందుడు అందరివాడేలే”తో మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
మెగాస్టార్ & పవర్‌స్టార్ కామెడీ టైమింగ్ ఒక రేంజ్‌లో వుంటుంది. వాళ్ళ సినిమాల కమర్షియల్ రేంజ్ పెరగడానికి ఆ టైమింగ్ పెద్ద కారణం అని చెప్పుకొవచ్చు. ఇప్పటివరకు వాళ్ళ మాదిరి చరణ్ కామెడి ప్రయత్నం చెయ్యలేదు. ఎప్పుడూ చేస్తాడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మెగా అభిమానుల కోరిక బ్రూస్‌లీతో తీరనుంది. చరణ్ కామెడి టైమింగ్ చూసి శ్రీనువైట్ల షాక్ తిన్నానని అంటున్నాడంటే, అభిమానులు ఎంత ఆనందిస్తారో చెప్పక్కర్లేదు. good job Srinu Vaitla.