జిరోను హిరో చెయ్యాలన్నా, హిరోను జిరో చెయ్యాలన్నా మిడియా పాత్ర కీలకం. కాకపొతే హిరోలోనైనా జిరోలోనైనా కొద్దిగానైనా విషయం వుండాలి. తెలుగుదేశం పార్టీ ఇంకా వుందంటే దానికి కారణం “ఈనాడు” అని నమ్మిన వ్యక్తి స్వర్గీయ వైయస్సార్. రాజకీయాల్లో కొనసాగాలంటే మిడియా అవసరాన్ని గ్రహించిన వైయాస్సార్, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా జగన్ చేతే సాక్షి పెట్టించాడు.
ఈనాడు అధినేత రామోజిరావు & సాక్షి అధినేత జగన్ ఈ మధ్య కలుసుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారోనని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. సరదా కోసం అటువంటి చిన్న ఊహ:
జగన్: పవన్‌కల్యాణ్ సర్దార్ ఆగిపోయిందంట కదా! మొన్న ఎన్నికల్లో కొందరు కాపు సొదరుల ఓట్లు మాకు కాకుండా చేసిన పవన్‌కల్యాణ్‌కు తగిన శాస్తి జరిగింది.
రామోజి: ఆగిపోయిందనేది వైయస్సార్ మిడియా చేస్తున్న దుష్పచారం.
పవన్‌కల్యాణ్ ట్వీటు: నాకు కులమత భేదాలు లేవు.
from xyz.com
గబ్బర్ సింగ్ సీక్వెల్ మొదలు అయిన దగ్గర నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. తొలుత ఈ సినిమా కి దర్శకుడు సంపత్ నంది అనుకున్నారు కాని సినిమా మొదలయ్యే లోపే దర్శకుడు మారిపోయాడు. సినిమా మొదలు అవ్వగానే ఆర్ట్ డైరెక్టర్ కూడా మారిపోయాడు. ముందుగా అనిశ ని హీరోయిన్ గా అనుకున్నారు కాని తర్వాత ఆ స్థానం కాజల్ అగర్వాల్ కి ఇచ్చేసారు. రెండో షెడ్యూల్ అయిపోగానే కెమెరా మాన్ కూడా మారిపోయాడు. అయితే , ఇప్పుడు ఈ సినిమా యూనిట్ లో అంతర్లీనంగా కొన్ని గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ గొడవలకి కారణం దర్శకుడు బాబీ నే అని గట్టి వాదన వినిపిస్తుంది. కెమెరా మాన్ విషయం లో బాబీ మాట విన్న పవన్ కళ్యాణ్ ఇంకా బాబీ ని భరించలేకపోతున్నాడు అని టాక్.సీనియర్ కెమెరా మాన్ విన్సెంట్ ని తప్పించడం పవన్ కి అస్సలు నచ్చలేదు కాని బాబీ మాట విని విన్సెంట్ ని తప్పించాడు. అయితే ఇదే అదును గా తీసుకున్న బాబీ స్క్రిప్ట్ లో కూడా మార్పులు సుచించాడట. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ బాబీ కి పెద్ద క్లాసు పీకినట్లు సమాచారం. స్క్రిప్ట్ విషయం లోనే తేడ వచ్చి అపట్లో సంపత్ నంది ని తొలగించిన సంగతి మనకు తెలిసిందే. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే , బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ లో చివర వరకు ఉంటాడో లేదో అనే కామెంట్లు గట్టిగా వినపడుతున్నాయి.