ఈరోజుల్లో ఏది నిజంగా చెపుతున్నారు? ఏది సందర్భానుసారం చెపుతున్నారు? అని తెలుసుకొవడం చాలా కష్టం. ఒక పక్క అభిమానులు దేవుళ్ళు అని అంటారు. మీ చేసే “అల్లరే” “గోలే” మాకు ఎనర్జీ అంటారు. మరో పక్క “నోర్ముస్కోండి ..” “ఓరేయ్ గిరేయ్” అంటూ వుంటారు. ఉన్నత స్థానంలో వుండి విజ్ఞ్జత కొల్పోయే వాళ్ళను పక్కన పెట్టి నిజాయితీగా మాట్లాడే మాటలను(చిన్న పెద్ద అని తేడా లేకుండా) ప్రొత్సహించవలసిన బాద్యత అందరిపై వుంది.
క్రిష్ దర్వకత్వంలో వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కంచె’. ప్రజ్ఞా జైస్వాల్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన మాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దానికి కారణం వెరీ సింపుల్, హృదయం నుంచి వచ్చిన “మాటలు”. అర్దం తెలుసుకొని మరీ, సిరివెన్నెలను అభినందించిన తీరు చాలా బాగుంది. Very Nice of Her.
httpv://youtu.be/tes_tSaU1mo
ఆ లిరిక్స్ వెనుక సిరివెన్నెల శ్రమ ఇక్కడ చూడవచ్చు:
httpv://youtu.be/uGrg2EljlWs