రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘బ్రూస్‌లీ’. భారీ బడ్జెట్‌తో భారీగా నిర్మింపబడుతున్న చిత్రం. లేచలో పాట చూస్తుంటేనే తెలుస్తుంది. చాలా తక్కువ సమయంలో శ్రీనువైట్ల ఇంత పెద్ద సినిమాను తయారుచేసాడు. శ్రీనువైట్లపై రెండు బాద్యతలు వున్నాయి:
- చరణ్‌లోని కామెడి టైమింగ్ బయటకు తీయ్యాలి
- శ్రీనువైట్ల ఫార్ములాను కోనవెంకట్-గోపి మోహన్ విచ్చలవిడిగా మిగతా దర్శకులతో వాడేసుకొని ప్రేక్షకులకు విసిగించెయ్యడంతో, ఫార్ములని మార్చి ఎంటర్‌టైన్‌మైంట్ చూపించటం
ఎంతవరకు సక్సస్ అవుతాడో తెలియదు కాని, ఆ రెండు ప్రయత్నాలు చేసానని చెపుతున్నాడు. శ్రీనువైట్ల నిజంగానే అప్‌డేట్ అయ్యాడా? అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 16 వరకు ఆగాలి. అక్టోబర్ 2 ఆడియో రిలీజ్ అవుతుంది.