మెగా అభిమానుల్లో సందడి మొదలైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో చిరు మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చి ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో పాల్గొంటున్నారు. చిరంజీవి ఏ సందర్భంలో కనిపిస్తాడు, ఎంతసేపు కనిపిస్తాడనే విషయాన్ని డైరక్టర్ సరప్రైజ్‌గా వుంచుదాం అని అనుకున్నాడు కాని, అత్యుత్సాహం ఫ్యాన్స్ వుంచనీయడం లేదు. చిరు కేవలం 3 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని రూమర్స్ మొదలయ్యాయి.
కొందరు 3 నిమిషాలు మాత్రమేనా అని నిరుత్సాహపడుతుంటే, మరికొందరు “ఒక నిమిషం అయితే ఆనందిస్తాం, రెండు నిమిషాలు అయితే రెచ్చిపొతాం, మూడు నిమిషాలు అయితే మురిసిపొతాం” అని అంటున్నారు.
చిరు పార్ట్ కాకుండా మిగతా పార్ట్ షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. రామ్‌చరణ్ మాక్సిమమ్ కష్టపడుతున్నాడు. అక్టోబర్ మొదటి వారం కల్లా షూటింగ్ పూర్తవుతుంది. దసరా కానుకగా అక్టోబర్ 16న సినిమా రిలీజ్ కానుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.