మోగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకి దర్శకత్వం వహించడానికి అందరికంటే తనకే ఎక్కువ హక్కుందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్విట్ చేశాడు. ‘చిరంజీవి 150వ సినిమా చేయడానికి అందరికంటే నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం.. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనకి పెద్ద ఫ్యాన్ని. తెర మీద చిరంజీవి ఎలా ఉండాలో ఆయన కన్నా….ఫ్యాన్స్కే తెలుసు. ఈ కథ కుదరక పోతే మరో కథ చేస్తాను. అదీ కుదరక పోతే ఆయనకి నచ్చేంతవరకు చేస్తా. 150వ సినిమా నేనే చేస్తా…లేదంటే 151వ సినిమా చేస్తా. ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలన్నదే నాకోరిక’ అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
పైన సోది పక్కన పెడితే, చిరంజీవి 150వ సినిమా ఛాన్స్ పూరీకే ఇవ్వాలి. కాకపొతే పూరీ వ్రాసే కథలు కాకుండా, టెంపర్ మాదిరి బయటవాళ్ళ కథతో చెయ్యాలి. అసలు ఒత్తిడి ఫీల్ అవ్వకుండా చెయ్యగల దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక్కడే.