బ్రూస్ లీ ట్రైలర్ రివ్యూ

ram charan

రామ్ చరణ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “బ్రూస్ లీ”. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో నిన్న విడుదలైంది. ఆడియో విడుదల సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ద్వారా కథ ఏమిటనేది కాకుండా, ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ వున్నాయనే చెప్పే ప్రయత్నం చేసారు.

  1. యాక్షన్ సీక్విన్సస్ అంటే పూరి జగన్నాధ్ బాగా తీస్తాడు. శ్రీనువైట్ల అంతకు మించి తీసాడు.
  2. సెంటిమెంట్ వుంది. ట్రైలర్‌లో ఎక్కువ ఫోకస్ పెట్టలేదు.
  3. ఎంట్‌ర్‌టైన్‌మెంట్ వుంది. రామ్‌చరణ్ చిరంజీవిని మించి కామెడి టైమింగ్‌తో చేసాడని శ్రీనువైట్ల అన్నాడు. కాని, ట్రైలర్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇది నిజమైతే కేకలే.(ఇది ఇంపాజిబుల్ అని అందరికీ తెలుసు. ఈ సినిమాలో 25% చేసినా చాలు.)
  4. హిరోయిన్ అందచందాలు.
  5. ఇక డాన్సస్. మొదటి రోజు ప్రేక్షకులను ఆకట్టుకొవడానికి కావాల్సింది ఇవే. సినిమా ఎవరేజ్‌గా బోర్ లేకుండా చూడగలిగే విధంగా వుంటే చాలు. రిపీట్ ఆడియన్స్ వుంటే, ఆటోమేటిక్‌గా కమర్షియల్ రేంజ్ పెరుగుతుంది. “వామ్మో .. రామ్‌చరణ్ .. ఎంత కష్టపడుతున్నాడో” అని అనిపించే విధంగా ఇరగదీసేసాడు.
  6. ఈ మధ్య ట్రైలర్స్ అన్నీ బాగా కట్ చేస్తున్నారు. సినిమా వచ్చేటప్పటికి ట్రైలర్‌లో వున్న ఆ స్పీడ్ వుండటం లేదు. ఈ సినిమా పబ్లిసిటీ/హైప్ కోసం, ఎన్నాడు లేని విధంగా చాలా కంటెంట్ రిలీజ్ చేసేసారు. బహుశా నాయక్ & ఎవడు ఫుల్ సాంగ్స్ రిలీజ్ అయిపొయినా, ఆ సినిమాలకు డామేజ్ అవ్వలేదు సరికదా, బాగా హెల్ప్ అయ్యాయనెమో.

bottomline:

  • మహేష్‌బాబు చెప్పినట్టు ఫ్లాప్ అయితే స్క్రిప్ట్ ఒప్పుకున్న హిరోనే బాద్యుడు అయినా హిట్ అయితే హిరో గొప్ప, ఫ్లాప్ అయితే డైరక్టర్‌ని తిట్టుకునే విధంగా వుండాలి. అప్పుడే ప్రేక్షకులు, అభిమానుల ఇగో సాటిస్‌ఫై అవుతుంది.
  • ఎంతో కష్టపడి స్క్రిప్ట్ వర్క్ చేసిన కష్టం అంతా శ్రీనువైట్లది అయినా, రామ్‌చరణ్ మీదే ఎక్కువ బరువు/ఒత్తిడి వుంది.

httpv://youtu.be/gr3lFtOqkuc

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ, Featured. Bookmark the permalink.