దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ – ది ఫైటర్’. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే.
”బ్రూస్‌లీ టైటిల్‌కు కథకు సంబంధం లేదు. మరి ఎందుకు పెట్టారో తెలియదు” అని మొదలు పెట్టిన చిరంజీవి, నోరు జారానని అనుకున్నాడో ఏమిటో దానిని కవర్ చేస్తూ, “ఎంటర్ ది డ్రాగన్‌లాగా ఈ సినిమాలో కూడా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ ప్రాధాన్యంగా ఉంటుంది. ‘బ్రూస్‌లీ’ టైటిల్ కథకు సముచితంగా, న్యాయంగా ఉంది.” అని అన్నాడు.
bottomline:
- బ్రూస్‌లీ టైటిల్‌కు కథకు సంబంధం లేదు.
- మాస్ రీచ్ కోసం .. మంచి ఈజీ సౌండింగ్ కోసం .. హిరోను బ్రూస్‌లీ ఫ్యాన్‌గా చేసారు.
- హిరో ఎలాను ఫైటర్ కాబట్టి, బ్రూస్‌లీ టైటిల్ అంత ఎబ్బెట్టుగా వుండదు.
- ఎనౌన్స్ చేసిన మొదట్లో డబ్బింగ్ టైటిల్ అనిపించింది కాని, ఇప్పుడు బాగానే అలవాటు అయిపోయింది.