బ్రూస్‌లీలో చిరంజీవి లుక్ కోసం వెయిటింగ్

charan

రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్‌లీ’ దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోన్న ఈ సినిమా చివరి దశ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్ తన పార్ట్‌కి సంబంధించిన షూట్‌ని శరవేగంగా పూర్తిచేస్తూనే మరోవైపుడబ్బింగ్ కూడా చెబుతున్నాడు. ఈ సినిమాలో చరణ్‌తోపాటు మెగాస్టార్ చిరుకూడా ఓ మూడు నిమిషాలపాటు కనువిందు చేయనున్నాడు. ఆ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. మరో 3 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘ది ఫైటర్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్నాడు. అతడి సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నదియా, రావురమేష్, కృతికర్బంద ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఆడియో ఇటీవలే రిలీజ్ అయి అభిమానుల్లో సూపర్ టాక్ తెచ్చుకుంది.

ఆడియో ఫంక్షన్ నెల రెండు నెలల ముందు కాకుండా, ఇలా బ్రూస్‌లీ సినిమా మాదిరి రెండు వారాల ముందు రిలీజ్ చేస్తే బెటరెమో. ఎందుకంటే రెండు వారాలు గ్యాప్ లేకుండా ఆ సినిమా గురించే మాట్లాడుకునే విధంగా ఎదో యాక్టివిటీతో సినిమా పిచ్చోళ్ళను & అభిమానులను కట్టిపడేయచ్చు.

సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే వుండటంతో మొన్న ఆడియో ఫంక్షన్లో సినిమా సంబంధించిన కంటెంట్ చాలా రిలీజ్ చేసారు. దానితో సినిమాపై అభిమానుల అంచనాలు బాగా పెరిగినా, బ్రూస్‌లీలో చిరంజీవి లుక్ కోసం వెయిటింగ్ మొదలైంది.

AHITEJA ‏@ahiteja666
Just seen few stills of #Megastar from #BruceleeTheFighter .
M I N D B L O W I N G !!
Walk ki Thagga backdrop 👌🏻👌🏻
Tq Seenu garu& Manoj🙏

Megastar Abhimani ‏@kiran_tpt
@ahiteja666 Maaku yeppudu Dakkuthundii Ahh Adrustam 16th ani matram Cheppadu Bro..

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ, Featured. Bookmark the permalink.