తెలుగులో సినిమా రిలీజ్‌కు ముందు ఒక పెద్ద సినిమా రెండు నిమిషాల పాట రిలీజ్ చెయ్యడం, అదీ ఆడియో రిలీజ్ అవ్వకముందు చెయ్యడం, ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంట. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని మరీ సినిమా మొదలు పెట్టడం వలనెమో, డైరక్టర్ .. హిరో అందరూ బిజీగా వున్నారు. ఒక పక్క షూటింగ్ … మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ..
మాటలతో కాకుండా, కంటెంట్‌తో పబ్లిసిటి చేస్తున్నారు. ట్రయిలర్ లో కథ చెప్పాలని కాకుండా, ఫ్యామిలీ పాయింట్లు..మాస్ కు నచ్చే ఫైట్లు..పాటలు, యూత్ నచ్చే డైలాగులు, ఫన్ అన్నీ వుండేలా చూసారు..
ట్రయిలర్ లో
- సుజుకీ సుబ్రహణ్యం అంటూ బ్రహ్మీ మరోసారి మెరుపులా మెరిసాడు..
- పోసాని ‘జుట్టు మనదే కదా అని మనమే కట్ చేసుకోం కదా’ అంటూ తన స్టయిల్ డయిలాగ్ ఒకటి వదిలాడు.
- హీరో రామ్ చరణ్ డైలాగ్ ‘ఎలగెలగ’ ను మళ్లీ రకుల్ భలేగా రిపీట్ చేసింది.
ఇలా అన్నీ బాగున్నాయి. ఇక సాంగ్స్ చెప్పక్కర్లేదు. పవన్‌కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ ఎలానో, రామ్‌చరణ్‌కు బ్రూస్లీ అలా అయ్యేట్టు వుంది.. రిపీట్ వాల్యూ బాగా వుండేట్టు వుంది.