బ్రూస్ లీ – రేపు సెన్సార్

charan

సినిమా మొదలవ్వకుండానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని, ఆ డేట్ కొసం 24X7 గంటలు పనిచేసిన సినిమా బ్రూస్‌లీ.ఈ రోజు రాత్రి కల్లా రీ రికార్డింగ్ పనులతో పాటు డిటిఎస్ పనులు కూడా పూర్తికానున్నాయి. అవి పూర్తయితే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. రేపు సెన్సార్.

kona venkat ‏@konavenkat99
Though our title BRUCLEE has an action feel, our film is a complete entertainer with a beautiful coat of sentiments. U will see a new RC !!

బ్రూస్ లీ- ది ఫైటర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్నా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ ఉన్న కంటెంట్ తో చేసిన సినిమా ‘బ్రూస్ లీ’ అని అంటున్నాడు కోన వెంకట్.

సినిమా రిలీజ్‌కు ముందు ఇలా చెప్పడం మాములే కాబట్టి, ఆ మాటల్లో నిజం ఎంతో తెలియటానికి మరో నాలుగు రోజులు ఆగితే చాలు.

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. శ్రీను వైట్ల దర్శకుడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ, Featured. Bookmark the permalink.