చిరంజీవి vs బాలకృష్ణ టాపిక్ వచ్చినప్పుడు, మెగా అభిమానులు బాలకృష్ణపై వంశంకు సంబంధించి చాలా విమర్శలు చేసేవాళ్ళు. “what goes around comes around” అన్నట్టు, అప్పుడు చేసిన విమర్శలన్ని ఇప్పుడు రామ్‌చరణ్ రూపంలో తిరిగి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే బాలకృష్ణపై విమర్శలు చేసిన కొందరు మెగా అభిమానులు రామ్‌చరణ్‌ను ఓపెన్‌గా సపోర్ట్ చెయ్యడానికి ఇష్టపడరు.
వారసుల విషయంలో వీడు మనోడురా అని మొదలైన అభిమానం, వారసుడు నిలబెట్టుకుంటేనే అది నిలబడుతుంది. చిరంజీవి వారసత్వాన్ని చరణ్ నిలబెట్టగలడని, చిరుత సినిమాతోనే అటు మెగాస్టార్‌లోనూ, ఇటు కొంతమంది మెగా అభిమానుల్లోను రామ్‌చరణ్ నమ్మకం కలిగించాడు. కాని, ఇంకా కొంతమంది మెగా అభిమానులకు ఇంకా అనుమానం వుంది.
రామ్‌చరణ్ కామెడి టైమింగ్ చూపించే సినిమా వస్తే, రామ్‌చరణ్‌ను చిరంజీవి వారసుడిగా అంగీకరించాలా వద్ధా అని సందిగ్ధంలో వున్న కొంతమంది మెగా అభిమానులు కూడా పూర్తిగా రామ్‌చరణ్‌ను సపోర్ట్ చేసే అవకాశం వుంది. ఈ విధంగా “బ్రూస్ లీ” సినిమాపై మెగా అభిమానుల భారీ హోప్స్ పెట్టుకున్నారు. 4 more days to go.