ఒక మంచి సినిమాగా ప్రేక్షకులు ఫీల్ అవ్వాలంటే ఈ అర్డర్‌లో ఒక దాన్ని మించి ఒకటి బాగుండాలి.
కథ-కథనం
కథను ప్రెజెంట్ చేసే దర్శకుడు
నటీ నటులు
కాకపొతే, మన తెలుగుసినిమా ఇండస్ట్రీ హిరో డామినేటడ్ కాబట్టి, సక్సస్ క్రెడిట్ అంతా హిరో ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కథా రచయితలు, డైరక్టర్స్ ఎంత కష్టపడినా .. వాళ్ళు హిరోల చుట్టూ తిరగవలసిందే. హిరో “యస్” అంటేనే ఆ సినిమాకు ఒక రూపం, ఆ రూపానికి తగ్గ విజయం వస్తాయి.
హిరో తర్వాత డైరక్టర్స్‌దే పైచేయి. కథా రచయితలు, డైరక్టర్ అనుకున్న పాయింట్‌కు కథనం డెవలెప్ చేయవలసి వుంటుంది.
బ్రూస్‌లీ కథ శ్రీను వైట్లది. ఆ కథకు మంచి కథనాన్ని అందించగలరని కోన వెంకట్-గోపిలను శ్రీను వైట్లతో రామ్‌చరణ్ కలిపాడు. కోన వెంకట్-గోపిల సహకారం చాలా పెద్ద ప్లస్. అది కచ్చితంగా ఎవరూ ఖండించలేరు. రామ్‌చరణ్ మొన్న చాలా వివరంగా చెప్పాడు.
ఈరోజు ఏమిటి, కోన వెంకట్ టి.వి5 ఇంటర్వ్యూలో మొత్తం మాదే అన్నట్టు మాట్లాతాడు? .. ఇలా అడ్డుగోలుగా మాట్లాడుతున్న కోనవెంకట్‌ను తట్టుకొవడం కష్టమే అని టి.వి5 ఇంటర్వ్యూ చూసిన వాళ్లు ఫీల్ అవుతున్నారు.. గోపి మోహన్ లేకపొతే కోనవెంకట్ లేడు అని మర్చిపోయి, గోపి మోహన్‌ను అసలు మాట్లాడనివ్వలేదు..
సినిమాలో చిరంజీవి సీను వుండేలా చేసింది శ్రీనువైట్ల.
మంచి సీను క్రియేట్ చేసింది గోపి మోహన్.
కోన వెంకట్ చేసింది ఏముంది? కొద్దిగా షూగర్ కోటింగ్ ఇచ్చి వుంటాడు .. అంతే కదా?
శ్రీనువైట్ల ఫార్ములాను(మూలం: గుడుంబా శంకర్) కోనవెంకట్ వేరే దర్శకులతో కూడా చేయించేసి, ఆ ఫార్ములా మీదనే ప్రేక్షకులకు విరక్తి వచ్చేలా చేసాడు.
ఇప్పుడు నేను లోకపొతే శ్రీనువైట్లనే లేడు. బ్రూస్‌లీనే లేదు అన్నట్టు వున్నాయి కోనవెంకట్ మాటలు. చరణ్ తప్పు చేసాడెమో అని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.