నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ జంటగా రెండో ప్రపంచ యుద్ధంపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ కంచె’. ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 22న విడుదల కాబోతుంది. తొలుత నవంబరు 6న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించినా అనూ హ్యంగా ‘అఖిల్ ‘సినిమా వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసున్నారట. చరణ్ సినిమా అప్పటికి వారం కూడా ఫినిష్ కాదని తెలియదా?
వరస్ట్ మెగా ప్లానింగ్. వారం గ్యాప్‌లో రెండు మెగా సినిమాలా?.. అదీ చరణ్ సినిమాకు పొటీగా. అసలే డివైడ్ టాక్‌తో మొదలైంది.
‘కంచె’ అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో సాగే ఒక ప్రేమ కథ ఈ ‘కంచె’. డైరెక్టర్ క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజమైన వరల్డ్ వార్ 2 గన్స్, ట్యాంక్స్‌తో జార్జియాలో భారీ వ్యయంతో చిత్రీకరించిన వార్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది.
ఇందులోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారని నిర్మాతలు రాజీవ్ రెడ్ది, జాగర్లమూడి సాయి బాబు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.