Thanks to శ్రీనువైట్ల, చరణ్ & నాగార్జున

Bruce Lee

బ్రూస్‌లీ ఫైనల్ పబ్లిక్ టాక్ ఏమిటంటే::

  • ఫస్టాఫ్ బాగుంది. సెంటిమెంట్ బాగా పండింది.
  • సెకాండాఫ్ అసలు బాగో లేదు.(సెకండాఫ్ స్క్రిప్ట్ మీద ఇంకొన్ని రోజులు పని చేసుంటే బాగుండేది)
  • సాంగ్స్ అన్నీ బాగున్నాయి. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మేజర్ హైలట్. అరిపించాడు. Thanks to Thaman
  • రామ్‌చరణ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి.
  • చిరంజీవి ఎపిసోడ్ పర్వాలేదు. బాగానే వుంది.

Why Thanks to శ్రీనువైట్ల, చరణ్ & నాగార్జున?
రామ్‌చరణ్ మహేష్‌బాబులా అందగాడు కాదు, ఎన్.టి.ఆర్ లా పెరఫార్మర్ కాదు, పవన్‌కల్యాణ్ లా ఇంకా సొంత ఇమేజ్ రాలేదు, బన్నీ అంత ఎనర్జీ రోల్స్ ఇంకా ప్రయత్నం చెయ్యలేదు. ఇవన్నీ ఒప్పుకోవల్సిన నిజాలు.

కాకపొతే చరణ్ S/O చిరంజీవి. చిరంజీవి వారసత్వం ముందుకు తీసుకు వెళ్ళ వలసిన బాద్యత వుంది. ఈ బాద్యత మాములు బరువు కాదు, మాములు ఒత్తిడి కాదు. (ఎంత ఒత్తిడి బరువు, బాద్యత అయినా రాజమౌళి చెప్పినట్టు శాపం మాత్రం కాదు)

చరణ్ మాక్జిమమ్ కష్టపడ్డాడు. చేయగల్గింది చేసాడు. తను చెయ్యలేని ఓవర్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చెయ్యలేదు. రామ్‌చరణ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అనే కంటే, ప్రేక్షకులు అలవాటు పడటానికి టైం కావాలంటే కరెక్టెమో. మంచి స్టొరీ సినిమాలు పడితే అన్నీ సెట్ ఆయిపొతాయి. అసలు వర్రీ అవ్వలిసిన పని లేదు. హార్డ్ వర్కింగ్ చేస్తున్నాడు. అది చాలు.

డాన్సస్‌లో ఏ హిరో మ్యాచ్ చెయ్యలేడు. Thanks to Charan.

సెకాండాఫ్ కథనం మాత్రం ఘోరంగా దెబ్బకొట్టింది. స్క్రిప్ట్ మీద ఇంకొన్ని రోజులు పని చేసుంటే బాగుండేది. సెకాండాఫ్ కథనం పక్కన పెట్టి చూస్తే, శ్రీనువైట్ల పెద్ద హిరోకు కావాల్సిన కథ బాగా సెట్ చేసాడు. కేవలం నాలుగు నెలల్లో ఫినిష్ చెయ్యడం నిజంగా గ్రేట్. డైరక్షన్ అదిరింది. చరణ్‌ను చూపించిన విధానం అదుర్స్. పాటల డిజైనింగ్, టేకింగ్ .. కేక. Thanks to Vaitla.

పండగ సీజన్‌ను వదులుకొవడం నిజంగా పెద్ద త్యాగం. ఇది కచ్చితంగా బ్రూస్‌లీకి పెద్ద ఎడ్వాంటేజ్. Thanks to Nagarjuna.

bottomline:
దాసరి మాటలు విని పండగకు కాకుండా, వాయిదా వేసుంటే .. సెకాండాఫ్ దెబ్బకు కలక్షన్స్ ఘోరంగా వుండేవి. అందుకనే చరణ్ “దాసరి మాటలు వినటానికి బాగుంటాయి .. చేతల్లో కష్టం ..” అన్న మాటలు 100% కరెక్ట్.

చరణ్ ప్లానింగ్ అదిరింది. తన బాద్యతతో పాటు తన లిమిటేషన్స్ బాగా తెలిసినోడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ, Hari Reviews. Bookmark the permalink.