బాహుబలిని మించి కంచె

Krish Kanche

బాక్సాఫీస్ స్టామినాను తెలియజేసిన తెలుగు సినిమా బాహుబలి అయితే, చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తెలుగుసినిమా రుద్రమదేవి. బాహుబలిలో గ్రాఫిక్స్‌లో అక్కడక్కడా మరీ పేలవంగా వుంటే, వరస్ట్ గ్రాఫిక్స్ రుద్రమదేవిలో వున్నాయి. గ్రాఫిక్స్ ను తెలుగుప్రేక్షకులు క్షమించి ఆ రెండు సినిమాలకు నీరాజనం పలికారు. కాని ఆ సినిమాలను C/O తెలుగుగా చెప్పుకేలేము. కమర్షియల్ విజయం పరంగా బాహుబలిని చెప్పుకొవచ్చు, గ్రాఫిక్స్ పరంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేదు.

ఈ రెండు సినిమాలా తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో మునుపెన్నడూ రాని వరల్డ్ వార్ II కథతో రానున్న సినిమా ‘కంచె’. ఈ సినిమాలో తెలుగు ఆడియన్స్ ని అబ్బురపరిచే, సుమారు 10 నిమిషాల పాటు వరల్డ్ వార్ II ఎపిసోడ్ ఉంటుందని, బాహుబలిని మించిన యుద్ద సన్నివేశాలు కంచె సినిమాలో వున్నాయని, బాహుబలి మాదిరి సెట్‌లో వేసి తీసినట్టుగా కాకుండా, రియలిస్టిక్‌గా వరల్డ్ వార్ II వుంటుందని దర్శకుడు క్రిష్ అంటున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాకి రాజీవ్ రెడ్డి – సాయి బాబులు నిర్మాతలు.

బాహుబలి మాదిరి సంవత్సరాలు సంవత్సరాలు తీయలేదు. 200 కోట్లు ఖర్చు పెట్టలేదు. కేవలం 58 రోజుల్లో, 19 కోట్లతో తీసిన సినిమా కంచె. హాట్సాఫ్ టు క్రిష్.

httpv://youtu.be/C3Uz8R_OLLY

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె, Featured. Bookmark the permalink.