సినిమా ఫినిష్ చేయగలడా లేదా అనే అనుమానంతో అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఇప్పుడు వార్తల్లో ఎక్కింది. మొన్నప్పుడో దర్శకుడి తీరు నచ్చక పవన్‌కల్యాణ్ దర్శకుడిని మార్చే ఆలోచనలో వున్నాడనే వార్తలు వినిపించాయి. ఈమధ్యే హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఓ ఐటమ్ సాంగ్‌ను పూర్తి చేసిన యూనిట్ తాజాగా ఓ షెడ్యూల్ కోసం గుజరాత్‌లో లాండ్ అయింది. గుజరాత్‌లో పదిరోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో పలు యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించనున్నారు. దర్శకుడు బాబీ కంటీన్యూ అవుతున్నట్టే అని లెక్క వేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని ఎనర్జిటిక్ క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు శరత్ మరార్ నిర్మాత.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సంక్రాంతికి వచ్చే సూచనలు లేవు, ఎందుకంటే “అత్తారింటికి దారేది” నిర్మాత ఎన్.టి.ఆర్ తో తీస్తున్న “నాన్నకు ప్రేమతో” సంక్రాంతికి అని ఎనౌన్స్ చేసారు.