కంచె C/O తెలుగు

Kanche

వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన కంచె అనుకోకుండా దసరా బరిలో దిగింది. దసరా కంటే ముందే వచ్చేద్దామనుకుంది. కుదరకపోవడంతో… నవంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అఖిల్ చిత్రం అక్టోబర్ 22న రిలీజ్ కాకపోవడంతో కంచె నవంబర్ కంటే ముందు వస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగుతూ అద్భుత ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు ఈరోజే రానుంది. బాహుబలి మాదిరి ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. ఈ సినిమా ఎందుకు చేస్తున్నాడని విమర్శించిన మెగాఫ్యాన్స్ అందరూ, ఇప్పుడు ఈ సినిమా చేసే అదృష్టం వరుణ్ తేజ్ దక్కించుకున్నందుకు వరుణ్ తేజ్‌ను అభినందిస్తున్నారు.

తెలుగువాళ్ళు ఇది మా తెలుగుసినిమా అని చెప్పుకొవడానికి చాలా సినిమాలు వున్నాయి. కాని, అటువంటి తెలుగుసినిమాలన్నింటిని బాహుబలి డామినేట్ చేసేసింది. దానికి కారణం బాహుబలి కమర్షియల్ సక్సస్. అంతర్జాతీయ స్థాయిలో “బాహుబలి” చూడండి అని చెప్పుకునే సినిమా కాదు. కారణం 1) అంతర్జాతీయం స్థాయిలో లేని కొన్ని నాసిరకం గ్రాఫిక్స్ 2) సగం కథ.

అంతర్జాతీయ స్థాయిలో మా తెలుగుసినిమా అని చెప్పుకునే సినిమాల్లో క్రిష్ “గమ్యం” సినిమా కచ్చితంగా టాప్ 5 లో వుంటుంది. అంత లోతుగా వుంటుంది సినిమా. కంచె సినిమా ఏ స్థాయిలో వుంటుందో, కంచె C/O తెలుగు అవ్వడానికి ఛాన్సస్ వున్నాయో లేదో ఈరోజే తెలియనుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె, Featured. Bookmark the permalink.