తెలుగుసినిమాకు మంచి ఊపు తీసుకొచ్చిన సినిమాలు శ్రీనువైట్ల “దూకుడు” & హరీష్‌శంకర్ “గబ్బర్‌సింగ్”. హరీష్‌శంకర్ మంచి మాస్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకుంటే, శ్రీనువైట్ల C/O ఎంటర్టైన్మెంట్ అని ముద్ర వేయించుకున్నాడు. రీసెంట్గా ఈ ఇద్దరూ డైరక్టర్స్ మెగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తమ తర్వాత సినిమాకు కూడా మెగా హిరో కోసమే ప్రయత్నం చేస్తున్నారంట.
హరీష్‌శంకర్ “సుబ్రమణ్యం ఫర్ సేల్” సినిమా పర్వాలేదు అనిపించుకొంది. మిరపకాయ్ రేంజ్ సినిమా అనోచ్చు. హరీష్‌శంకర్ పాస్ అయినట్టే.
శ్రీనువైట్ల “బ్రూస్లీ” కూడా పర్వాలేదు. కాకపొతే ఆ ఫార్ములా పెద్ద హిరోలకు పని చేయదు అని అర్దం అయ్యింది. కథనంలో తేడా తప్పితే .. శ్రీనువైట్లకు వున్న క్లారిటీ, టేకింగ్‌లో లోపం లేదు. మంచి స్టొరీని ఎంటర్టైన్మెంట్గా చెప్పగలడు.
ఈ డైరక్టర్స్ ఇద్దరూ ఇప్పుడు బన్ని హిరోగా సినిమా చెయ్యాలనే ప్రయత్నాలు చేస్తున్నారంట. బన్ని, ఎవరి వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.