పలానా మార్గంలో సక్సస్ వుంటుందన్న గ్యారంటీ లేదు. కాని మెగా ఫ్యామిలికి మాస్ ప్రేక్షకుల అండదండలు బాగా వున్నాయి. వరుణ్ తేజ్ మాస్ సినిమాలు చేసి పెద్ద స్టార్ అవ్వాలని మెగా అభిమానులు కోరుకున్నారు. శ్రీకాంత్ అడ్డాలతో సినిమా కాని, క్రిష్ తో సినిమా చెయ్యడం కాని మెగా అభిమానులకు అసలు ఇష్టం లేదు. తన మొదటిసినిమా పూరి జగన్నాధ్ or వి.వి వినాయక్ లాంటి మాస్ దర్శకులతో చేసి, పెద్ద హిరోగా స్టార్ట్ చెయ్యాలనుకున్నారు.
నాగబాబు & వరుణ్ తేజ్ మాత్రం ఇంకోలా అలోచించారు. అడ్డాల్ శ్రీకాంత్ & క్రిష్ లనే నమ్ముకున్నారు. ముకుంద ఫెయిల్యూర్ మెగా అభిమానుల కొరికే కరెక్ట్ అనిపించినా, కంచె విజయం నాగబాబు & వరుణ్ తేజ్ ల నిర్ణయమే కరెక్ట్ అనిపించడంతో పాటు, దర్శకులు కొత్తగా అలోచించడానికి ఒక హిరో దొరికాడు. కాకపొతే, మెగా అభిమానుల కోరిక మేరకు నెక్స్ట్ సినిమా పూరి జగన్నాధ్ కావడం విశేషం. ఆ సినిమా ఏ ఇమేజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.