కంచె సినిమాపై ప్రధానంగా వస్తున్న విమర్శలు:
- హిరో హిరోయిన్ల మధ్య లవ్ కనక్షన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు
- వార్ ఎపిసోడ్‌లో ఒక వర్గంపై(jews) మరో వర్గం(Naji) దాడి ఇరికించినట్టు వుంది
- లోకల్ విలేజ్‌లో కుల గొడవలు సరిగ్గా చూపించలేదు
వ్యక్తిగత ఇంటరెస్ట్స్‌ను బట్టి కంచె సినిమాలో ఏమి మిస్ అయ్యాయో ఎవరికి వాళ్ళకు అనిపించవచ్చు. వెబ్ రివ్యూ ఫుల్ పాజిటివ్‌గా లేవు. రివ్యూ అనేది వ్యక్తిగతం కాబట్టి, వాటిని కామెంట్ చెయ్యలేము.(మమ్మల్ని మేము సపోర్ట్ చేసుకొవాలి కదా :))
ఎవరు బాగుందన్నా బాగోలేదన్నా, “కంచె రేటింగ్ 5/5” అంటున్నారు కంచె అభిమానులు.
కంచె అభిమానులు 5/5 ఇవ్వడానికి కారణాలు:
- సినిమా తీయడం తర్వాత, ఈ సినిమా కథ ఆలోచించడానికే ధైర్యం కావాలి. అటువంటిది, ఆ బడ్జెట్‌తో అన్ని తక్కువ రోజుల్లో ఈ రేంజ్ సినిమా తీయడం అంటే, 5/5 కాకుండా ఎంత ఇవ్వాలి?
- నటీ నటులు ఎంపికకు కచ్చితంగా 5/5 ఇవ్వల్సిందే. .. వరుణ్‌తేజ్ సరిగ్గా సూట్ అవుతాడని అప్పుడప్పుడో మదిలిన కథను బయటకు తీసిన క్రిష్ అభినందనీయుడు. వరుణ్ తేజ్ ఒక్కడే కాదు, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ఆయా పాత్రల్లో ఒదిగిపొయారు .. 5/5 కాకుండా ఎంత ఇవ్వాలి?
- డైలాగ్స్ .. మ్యూజిక్ .. 100% సెట్. 5/5 కాకుండా ఎంత ఇవ్వాలి?
- ఇది మా తెలుగుసినిమా, తప్పకుండా చూడండి అని వేరే బాషల వాళ్లకు గర్వంగా చెప్పుకునే సినిమా “కంచె”. ఈ సినిమా బడ్జెట్, ఈ సినిమాకు పని చేసిన రోజులు కూడా చెపితే ఆశ్చర్యపొవడం ఖాయం. 5/5 కాకుండా ఎంత ఇవ్వాలి?
- రెండు స్టోరీస్‌ను సమాంతరంగా క్రిష్ తీసిన విధానం. హాలీవుడ్ స్టాయికి ఏ మాత్రం తగ్గలేదు. 5/5 కాకుండా ఎంత ఇవ్వాలి?