బాహుబలి టి.వి సిరియల్ ప్లానింగ్‌లో రాజమౌళి

RM

Baahubali-3 is on cards…

But the story that’s written for theTwo parts will not be dragged for the sake of it. This story will conclude with the second part itself.

Baahubali-3 will be done in a way that audience have never experienced films before.

— RAJAMOULI

బిలో ఎవరేజ్ కంటెంట్ వున్న రుద్రమదేవినే మన తెలుగుప్రేక్షకులు అంతలా ఆదరించారంటే, బాహుబలిని ఇంతలో ఎవరికీ అందనటువంటి ఎత్తులో కూర్చో పెట్టడం పెద్ద ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. తెలుగుప్రేక్షకులు దేవుళ్ళు. కేవలం సినిమా కంటెంట్ మాత్రమే కాదు, తెరవెనుక కష్టాన్ని కూడా చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆదరిస్తున్నారు.

రాజమౌళి మనసులో ఏమి అనుకొని ప్లాన్ చేసాడో, బాహుబలి విషయంలో అదే జరిగింది. అందులో ఫస్ట్, ప్రతి తెలుగువాడు బాహుబలిని ఓన్ చేసుకునేలా చేసాడు. ఎవరేజ్ కంటెంట్, కొన్ని హై పాయింట్స్, కొన్ని అద్భుతమైన గ్రాఫిక్స్, కొన్ని అద్భుతమైన విజువల్స్ వుండటంతో .. పేలవంగా వున్న గ్రాఫిక్స్ పెద్ద నెగిటివ్ కాలేదు. సినిమా ఎక్సపెటేషన్స్ రీచ్ అవ్వని వాళ్ళ దగ్గరనుండి కూడా “సినిమా ఎవరేజ్, కాకపొతే ఒక్కసారి తప్పకుండా చూడవలసిన సినిమా” అనే టాక్ తెచ్చుకుంది.

ఒకప్పుడు సినిమా హైప్ చెయ్యడానికి ఎంతో భయపడే వాళ్ళు. ఇప్పటికీ కొందరు పెద్ద హిరోలు భయపడుతూ వున్నారు. అటువంటింది, బాహుబలి-2 కాంప్లీట్ అవ్వలేదు, అప్పుడే బాహుబలి-3 గురించి హైప్ మొదలుపెట్టాడు రాజమౌళి. ఆయన గట్స్‌కు హాట్సఫ్.

టి.వి సిరియల్స్‌లో పనిచేసి సినిమాల్లోకి రావడం వలనెమో, సినిమాలను సిరియల్స్ వైపు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. బాహుబలి-1 ను బాహుబలి-2 తో ముగించేసి, బాహుబలి-3 నుంచి సరికొత్త never ending సిరియల్ గా కొనసాగించే మాస్టర్ ప్లాన్‌లో వున్నాడు.

bottomline:
కంచె సినిమాలో అంత స్ట్రాంగ్ కంటెంట్ పెట్టుకొని క్రిష్ చూడండి, ఎన్ని కష్టాలు పడుతున్నాడో.

బాహుబలి సినిమా ఎవరేజ్, బిలో ఎవరేజ్ కంటెంట్‌తో అంత పెద్ద హిట్ అవ్వడానికి గల కారణాలు అందరికీ తెలుసు. కాని ఆ ఫార్ములాను ఎవరూ ఫాలో కాలేక పోతున్నారు. మాస్ పల్స్ తెలియడం అంటే అదే.

చాలామంది నిర్మాతలకు, దర్శకులకు మాస్ పల్స్ తెలుసు కాని, ఎవరైనా రాజమౌళి తర్వాతే.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Extended Family, Featured. Bookmark the permalink.