కోనవెంటక్ ఒక పేరు కాదు ఇప్పుడు, ఒక బ్రాండ్. శ్రీనువైట్ల లాంటి దర్శకులను కోకలల్లుగా తయారు చేసి ఇండస్ట్రీలోకి వదిలిన ఘనత కచ్చితంగా కోనవెంకట్‌దే. చాలా రోజులనుంచి డైరక్షన్ చేయలనే ఆలోచనలో వున్నాడు. కోనవెంకట్‌కు పవన్‌కల్యాణ్ డైరక్షన్ అవకాశం బాగుంటుందని పవన్‌ఫ్యాన్స్ ఆశీస్తున్నారు.
నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్, కామెడీ చిత్రం ‘శంకరాభరణం’. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 30న శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను సమంత కు అందించారు.
‘శంకరాభరణం’ సినిమా తెరవెనుక డైరక్టర్ కోనవెంకట్ అని ప్రచారం జరుగుతుంది. భారీ ఓపినింగ్స్ గ్యారంటి అని సినీ ప్రముఖులు అంటున్నారు.