వరుణ్ తేజ్, డైరక్టర్ పూరి జగన్నాద్ తో కలిసి చేసిన సినిమా షూటింగ్ ఫినిష్ అయిపొయింది. లోఫర్ టైటిల్ అని ఏనౌన్స్ చేసారు. ఆ టైటిల్ మరీ వరస్ట్‌గా వుండటంతో ‘మా అమ్మ సీతామహాలక్షి’ అనే పేరును పరిశీలిస్తున్నారు. “అత్తారింటికి దారేది” టైటిల్ క్లిక్ అవ్వడంతో, అదే తరహాలో ‘మా అమ్మ సీతామహాలక్షి’ ఫైనలైజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా వుంటుందని పూరి జగన్నాధ్ చెపుతున్నాడు. సినిమాని డిసెంబర్ 18న ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేయనున్నారు. వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించే ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానుంది. సి కళ్యాణ్ నిర్మాత.
పూరి జగన్నాధ్ టైం చాలా బాగుంది. హిరోకు మంచి హిట్ సినిమా తర్వాత ఇలా మూడో సారి తన సినిమా రావడం వలన ఆటోమేటిక్‌గా మంచి క్రేజ్ వచ్చేస్తుంది. మొన్న దూకుడు తర్వాత బిజెనెస్ మేన్. నిన్న గబ్బర్‌సింగ్ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు. ఇప్పుడు కంచె తర్వాత మా అమ్మ సీతామహాలక్షి.