అక్కినేని అఖిల్ నటించిన తొలి సినిమా ‘అఖిల్’, దీపావళి సందర్భంగా ఈ నెల 11న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. వివి వినాయక్ దర్శకుడు. ప్రముఖ హిరో నితిన్ నిర్మాత.
దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్, హీరో అఖిల్ ఇలా అందరూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ట్రైలర్స్‌లో అఖిల్ డ్యాన్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది కాని, థియేటర్ ట్రైలర్ మాత్రం కొద్దిగా నిరుత్సాహపరిచింది. ఇటువంటి తరహా కథ ప్రేక్షకులను అలరిస్తుందా అనే అనుమానం మొదలైంది.
అఖిల్‌ను తెరమీద చూడాలన్న ఆత్రుతకు వివి వినాయక్‌కు వున్న మాస్ & సక్సస్ ఇమేజ్ తోడవ్వడంతో మంచి హైప్ వచ్చింది. హైప్ కు తగ్గట్టు భారీగా రిలీజ్ చేస్తున్నారు. సినిమా మంచి టాక్ వస్తే, మొదటిసినిమాతోనే 50 కోట్ల హిరోగా అఖిల్ అయ్యే సూచనలు వున్నాయి.