కథా పరంగా కాని, గ్రాఫిక్స్ పరంగా కాని బాహుబలి సినిమాను ఇంటర్నేషన్‌ల్ రేంజ్ సినిమాగా ఆశీంచిన వాళ్ళని ఆ సినిమా నిరుత్సాహ పరిచింది. కాకపొతే సినిమా రిలీజ్‌కు ముందు ప్రతి తెలుగొడికి ఇది మన సినిమా అనే భావన కలుగుజేయడంలో రాజమౌళి సక్సస్ కావడంతో, సినిమాపై ఎనలేని హైప్ వచ్చింది.
సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులు రెండుగా విడిపొయారు.
1) ఇంటర్నేషన్ రేంజ్‌లో లేదు. కాని ఒక్కసారి కచ్చితంగా చూడవచ్చు అని కొందరు అంటే,
2) సినిమా రిలీజ్‌కు ముందు అందరూ ఇది మా సినిమా అని ఎలా ఓన్ చేసుకున్నారో, కొందరు అదే కంటీన్యూ చేసారు.
ఫైనల్ రిజల్ట్: 1) కనీవిని రీతిలో కలక్షన్స్. 2) రాజమౌళి మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
ఇప్పుడు ప్రతిసినిమాను బాహుబలితో కాంపేర్ చెయ్యడం మొదలుపెట్టారు. బాహుబలి అంత లేదనో, బాహుబలి రేంజ్‌లో కలక్షన్స్ లేవు అని కామెంట్ చేస్తున్నారు
హిరోల డామినేషన్ కొనసాగాలంటే బాహుబలిని మించిన సినిమా రావాల్సిన అవసరం ఎంతో వుంది. ఎటువంటి కంటెంట్‌తో తీస్తే, బాహుబలిని మించగలము అనేది పెద్ద ప్రశ్న. కంటెంట్ వున్నా, ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమా తీయగలరా అనేదో మరో ప్రశ్న అయితే, అందరూ ఇది మా సినిమా అని ఓన్ చేసుకునేలా ఏ హిరో చేయగలడు అనేది సమధానం లేని ప్రశ్న.
మగధీరను మించిన కలక్షన్స్ ఫ్యామిలీ జోనర్లో వచ్చిన “అత్తారింటికి దారేది” సినిమా వసూలు చేసింది. బాహుబలి కలక్షన్స్‌ని సర్దార్ గబ్బర్‌సింగ్ దాటకుంటే, మళ్ళీ, పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఆగాల్సిందే.