దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్‌పై రూపొందించిన సినిమా ‘కుమారి 21 F’. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, హీబా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మంచి కిక్ ఇస్తుంది.
- ప్రస్తుతం సుకుమార్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తుండటం వలన నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాను ఫుల్‌గా సపోర్ట్ చేస్తున్నారు.
- మహేష్‌బాబు కెరీర్‌లో “1” అనే విభిన్నమైన సినిమా సుకుమార్ ఇవ్వడంతో మహేష్‌బాబు అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.
- బన్నీ అభిమానుల సపొర్ట్ సుకుమార్‌కు ఎప్పుడూ వుంటుంది.
దీనికితోడు ‘కుమారి 21 ఎఫ్’ టీమ్ చేస్తోన్న ప్రచార కార్యక్రమాలు కూడా సినిమాపై మరింత అంచనాలను రేకెత్తిస్తున్నాయి.
కాకపొతే సుకుమార్ రైటింగ్స్ అంటే ఏ రసం తీస్కుకున్నా ఘాటెక్కువ వుంటుంది. పచ్చిగా వుంటుంది. ట్రైలర్ చూసినోళ్ళకు ఈ సినిమాలో కూడా యువతకు సంబంధించిన విషయాలు పచ్చిగా చెపుతున్న ఫీలింగ్ వచ్చింది. నవంబర్ 20వ తేదీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అందరూ ఊహించినట్టుగానే ఏ సర్టిఫికెట్ వచ్చింది.
ఘాటెక్కువగా వుండటంతో యవతను ఆకట్టుకునే అవకాశాలు వున్నాయి. యువతతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవాలంటే, ఈ సినిమాలో హిరోయిన్ విచ్చలవిడితనానికి గల కారణం ఆకట్టుకునేదై వుండాలంటున్నారు సినీ ఆభిమానులు.