కొన్ని ప్రశ్నలకు సమాధానం వుండదు. మరో ప్రశ్నే సమాధానం.
కొన్ని ప్రశ్నలకు ఉదాహరణలే సమాధానం.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా ‘కుమారి 21 ఎఫ్’. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ యూత్‌ఫుల్ క్రేజీ సినిమాగా విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైంది, అందుకే ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింని అందరూ అనుకుంటున్నారు. కాని ఆ చిత్ర హిరో రాజ్ తరుణ్ మాత్రం “ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదండీ. కుమారి 21F ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడదగ్గ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ. ఈ జనరేషన్ ప్రేమకథ కాబట్టి కొన్ని సెన్సార్ పరిధిని దాటిన అంశాల ప్రస్తావన ఉండొచ్చు. ఆ మాటకొస్తే.. ‘పోకిరి’, ‘మగధీర’ సినిమాలు కూడా ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలే! సెన్సార్ నిబంధనల మేరకు ఏ వచ్చిందే కానీ ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అస్సల్లేదు.” అని అంటున్నాడు.