”నేను రోజూ ఎన్నో అబద్దాలు ఆడుతుంటాను. నేను ఆడే ప్రతి అబద్దం నాకు ఆ క్షణంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ? .. ఆ ఆనందం శాశ్వతమా అనేది నాకు అనవసరం.”
నిజం ఎదుర్కోనే ధైర్యం లేక, చాలామంది అబద్ధం అనే ప్రపంచంలో గడిపేస్తూ వుంటారు. సెలబ్రేటీస్ జీవితం వేరే లోకం. వాళ్ళు కచ్చితంగా నిజ జీవితంలో కూడా నటించాలి. లేకపొతే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మొన్న చిరంజీవిని చూసాం. ఎవరో ఒక అభిమాని తనని ఇబ్బంది పెడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తుంటే, “స్టుపిడ్ ఫెలోస్” అని తన మనసులోని మాటను పైకి అనేసాడు. వెర్రి చేష్టలు చేసేవాడిని వదిలేసి, చిరంజీవిపై విమర్శలు వచ్చాయి. నిజం ఎవరికీ అక్కర్లేదు. చిరంజీవి అలా అనకూడదు అనే వాళ్ళే ఎక్కువ.
చిరంజీవి కేవలం అభిమానితో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు అమీర్‌ఖాన్ దేశం/మతం స్థాయికి సంబంధించి తన మనసులోని నిజాన్ని బయటకు చెప్పి, చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
httpv://youtu.be/jnZTcee5H7o
bottomline:
చిరంజీవి/అమీర్‌ఖాన్ వాళ్ళ మనసులోని మాట నిజం. నిజం చెప్పాలంటే అది నిజంగా నిజం కాదు. ఒకటి చాలా చిన్నది. మరొకటి చాలా పెద్ద తప్పు.
- ఒక పక్క వెర్రి అభిమానాన్ని గొప్పలుగా చెప్పుకొని, అదే వెర్రి అభిమానాన్ని అవమానించడం చిరంజీవి తప్పు.
- దేవుడి పేరు చెపుతూ సాటి మనిషిని అతిక్రూరంగా చంపుతున్న వాళ్ళను ప్రశ్నించకుండా, చంపుతున్న వాళ్ళపై వచ్చే విమర్శలను తనకు ఆపాదించుకొవడం అమీర్‌ఖాన్ తప్పు.