మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, తాజాగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ‘లోఫర్’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. “ఇడియట్” “పోకిరి” తరహాలో లోఫర్ హిట్ అవుతుందనే నమ్మకాలు ఎవరికీ లేకపొయినా, తప్పదు కాబట్టి అలా ఆ సినిమాలతో పోల్చుతున్నారు.. పాటల్లో పూరి పైత్యం చూసాకా, నిజానికి “దేవుడు చేసిన మనుషులు” “ఏక్‌నిరంజన్” మాదిరి డిజాస్టర్ కాకుండా వుంటే చాలు అని మెగా అభిమానులు దేవుడిని ప్రార్దిస్తున్నారు.
ఒకరోజు ముందే రిలీజ్:
డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే తాజాగా సినిమాను ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 17నే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిర్మాత సి. కళ్యాణ్ ఇదే విషయమై మాట్లాడుతూ.. డిసెంబర్ 17నే సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.