పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ చిత్రానికి పవర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ , పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
2016 మేలో కాని, జూన్‌లో కాని రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయి. “గుడుంబా శంకర్” సినిమా తర్వాత, స్క్రిప్ట్ విషయంలో కూడా పవన్‌కల్యాణ్ ప్రత్యేక శ్రద్ద పెట్టి చేస్తున్న సినిమా ఇది. ఈ తరహాలో చాలా తెలుగు సినిమాలు వచ్చేయటంతో, సబ్జక్ట్ పరంగా సినిమాలో ప్రత్యేకత ఏమీ వుండదనే అనుమానాలు వున్నా, పవన్‌కల్యాణ్ ఫుల్ ఫార్మ్‌లో వుండటం వలన, సినిమాపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి.