బాహుబలి రికార్ద్స్ బ్రేక్ చెయ్యడం మరో పది పదిహేనేళ్ళు ఇంపాజిబుల్. ఇండస్ట్రీ హిట్ అనే వర్డ్ తెలుగుసినిమా ఇండస్ట్రీ నుంచి తొలిగించవచ్చు. ఇండస్ట్రీ హిట్ రేంజ్ అని వాడటం జరుగుతుంది. దాని అర్దం బాహుబలిని పక్కన పెట్టి చూడండని.
టాలీవుడ్ హీరోల్లో ఎమోషన్స్ పండించడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. కమర్షియల్ విజయం పక్కన పెడితే, డైలాగ్ డెలీవరీ, పెరఫార్మన్స్ & డాన్స్ పరంగా చూస్తే ఎన్.టి.ఆర్ నెం 1. ఎన్.టి.ఆర్ రేంజ్‌కు తగ్గ కమర్షియల్ విజయం “నాన్నకు ప్రేమతో” అందుకుంటాడనే మాటలు వినిపిస్తున్నాయి.
ట్రైలర్ చూస్తుంటే, సుకుమార్ పైత్యం తగ్గించుకొని చేసినట్టే కనిపిస్తుంది. సుకుమార్‌కు వున్న పైత్యం ఏమిటంటే ప్రేక్షకులను కన్ఫ్యూజన్ చేద్దామనుకొవడం. మహేష్‌బాబు “1” తో సుకుమార్ తన తప్పులు తెలుసుకొని ఈ సినిమా చేసినట్టే కనిపిస్తుంది. కొత్త తప్పులు చేస్తే చెప్పలేం. సుకుమార్ సీన్స్ మైండ్ గేమ్ తో పాటు ఎమోషన్స్ ను మిక్స్ చేసినట్టు వున్నాడు. స్పష్టత లోపించకపొతే మహేష్‌బాబు “దూకుడు”, “శ్రీమంతుడు”, అల్లు అర్జున్‌కు “రేసుగుర్రం”, పవన్‌కల్యాణ్‌కు “గబ్బర్‌సింగ్”, “అత్తారింటికి దారేది” సినిమాల సరసన ఎన్.టి.ఆర్ “నాన్నకు .. ప్రేమతో” చేరే అవకాశాలు వున్నాయి.