"నాన్నకు .. ప్రేమతో" – 2016 సంక్రాంతి విన్నర్

Sankrathri_films

సంక్రాంతికి ఒకటి రెండు సినిమాలు వచ్చేవి. కాని ఈసారి ఇప్పుడు నాలుగు సినిమా వస్తున్నాయి. చిన్న సినిమాలు వచ్చినా న్యూస్‌లో వుండేవి కాదు. నాలుగు సినిమాల్లో చిన్న సినిమా అయిన “ఎక్సప్రెస్ రాజా” మాత్రం న్యూస్‌లో వుంటుంది. కారణం “మిర్చి” “రన్ రాజా రన్” & “భలే భలే మగాడివోయ్” లాంటి సినిమాలు ఇచ్చిన బ్యానర్ నుంచి రావడమే. మూడేళ్ళ క్రితం “మహేష్ బాబు” & “చరణ్” సినిమాలకు పోటిగా నిలబడి మిర్చి సినిమాను పండక్కి రిలీజ్ చేయలేక పోయారు. కాని ఇప్పుడు ఎన్.టి.ఆర్, బాలయ్య, నాగార్జునల సినిమాలకు భయపడకుండా తమ సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే, ఈ సినిమాలో ఏముందో? .. పెద్ద సినిమాలను తట్టుకొని నిలబడి సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశాలు తక్కువ.

“సోగ్గాడే చిన్ని నాయనా” ..నాగార్జునకు తన లిమిట్స్ బాగా తెలుసు. సంక్రాంతికి పోటిపడలేక, డిసెంబర్ నెలలోనే తన సినిమాలని రిలీజ్ చేసుకొని, అవి హిట్స్ చేసుకొని, డిసెంబర్ నెలను కూడా బిజీ చేసి ట్రెండ్ క్రియేట్ చేసాడు. “మనం” సినిమా తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ “నేను ఎందుకు తగ్గాలి? నేను ఏమి తక్కువ?” అని అనుకొని ఈ సారి సంక్రాంతికి వస్తున్నాడు. ట్రైలర్ & సాంగ్స్ .. సినిమా గ్యారంటి హిట్ అనే ఫీల్ తెచ్చాయి. కాని నాగార్జున చేసే మాస్ యాక్షన్ ఎంతవరకు సూట్ అవుతాది, ఎంతవరకు మెప్పిస్తాడనే దానిపై అనుమానాలు వున్నాయి. “కలిసుందాం రా” తరహాలో సరప్రైజింగ్‌గా సంక్రాంతి విన్నర్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

2001 సంక్రాంతికి చిరంజీవి మృగరాజు సినిమా రిలీజ్ రోజే బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా రిలీజ్ అవ్వడం, చిరంజీవి మృగరాజు అత్యంత దారుణంగా ఫెయిల్ అయ్యి, బాలకృష్ణ నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పాటు, ఆ సమయంలో చిరంజీవి ఫ్లాప్స్‌లో వుండటంతో బాలకృష్ణ నెంబర్ 1 అని కొందరు అనుకునే వారు. ఇప్పుడు డిక్టేటర్ విషయానికి వస్తే, సినిమా హిట్ అయితే తనకు ఇవ్వల్సిన క్రెడిట్స్ శ్రీనువైట్ల ఇవ్వలేదని నానా గొడవ చేసిన కోనవెంకట్, బ్రూస్‌లీ సినిమా ఫ్లాప్ అవ్వగానే తన సీన్స్ వాడుకోకుండా తన పేరు మాత్రమే వాడుకున్నారని శ్రీనువైట్లపై ఇండైరక్ట్‌గా కామెంట్స్ చేసి చాలా చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు డిక్టేటర్ సినిమాకు కోనవెంకట్ పనిచేసాడనేది ఈ సినిమాకు పెద్ద మైనస్. కాని దర్శకుడు శ్రీవాస్‌పై నమ్మకం వుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. సంక్రాంతి విన్నర్ అవ్వడం కష్టం అనిపించినా, డీసెంట్ హిట్ అని అనిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

“నాన్నకు .. ప్రేమతో” 2016 సంక్రాంతి విన్నర్ అని అందరూ ఫీల్ అవుతున్నారు. సుకూమర్ అంటే మహేష్ అభిమానులు, మెగా అభిమానులు & అక్కినేని అభిమానులు బాగా ఇష్టపడతారు. నందమూరి అభిమానులతో పాటు వాళ్ళు కూడా ఈ సినిమాకోసం ఎగబడటంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. సుకుమార్ తన పైత్యం కంట్రోల్ చేసుకొని ప్రేక్షకులను కన్‌ఫ్యూజన్ చెయ్యాలని కాకుండా, ప్రేక్షకులను మెప్పించాలని తీసుంటే వందకోట్ల సినిమా.

bottomline:
ఈ సంక్రాంతి, సినిమా పిచ్చోళ్ళకు అసలైన పండగ.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in నాన్నకు ప్రేమతో, Extended Family, Featured. Bookmark the permalink.

1 Response to "నాన్నకు .. ప్రేమతో" – 2016 సంక్రాంతి విన్నర్

  1. ramprasad అంటున్నారు:

    Bottom line keka…ఈ సంక్రాంతి, సినిమా పిచ్చోళ్ళకు అసలైన పండగ.

వ్యాఖ్యలను మూసివేసారు.