సినిమా ఎలా వుంది?
అందరూ ఏకగ్రీవంగా బాగుందనే సినిమా కాదు. ఎవరైనా మనస్ఫూర్తిగా సినిమా చాలా బాగుంది అనే సినిమా కూడా కాదు. కాని “సినిమా బాగుంది”.
రాజమౌళిని నుంచి సుకుమార్ ఏమి నేర్చుకొవాలి?
ఒకో దర్శకుడిది ఒక్కో స్టైల్. ఒకరి దగ్గర నుండి మరొకరు నేర్చుకొనేది ఏమీ వుండదు.
ప్రస్తుతం రాజమౌళి సక్సస్‌లో వుండటం వలన రాజమౌళిని ఎక్సాంపుల్‌గా తీసుకొవడం జరుగుతుంది. ఏ దర్శకుడైనా “ప్రేక్షకులను మభ్య పెట్టడం ఎలా?”, “ప్రేక్షకులను సినిమాతో కనెక్ట్ అయ్యేలా చెయ్యడం ఎలా?”, “ప్రేక్షకులు ఇది మన సినిమా అని అనుకునేలా ఎలా చెయ్యాలి?” అనేది నేర్చుకొవాలి.
సుకుమార్ & ఎన్.టి.ఆర్ .. ఒకే లక్ష్యంతో పని చేసారు. 1) చూసే వాళ్లకు కన్‌ఫ్యూజన్ వుండకూడదు 2) ఎన్.టి.ఆర్ కు మంచి పేరు రావాలి.
ఈ రెండు లక్ష్యాలు అసలు పాయింట్ అయిన, “ఎమోషన్” ను డామినేట్ చెయ్యడంతో కొందరు కనెక్ట్ కాలేకపొయారు.
అతితెలివైన వాడికంటే తెలివైన వాడు అని చెప్పే సన్నివేశాలు ఏమీ లేకపొయినా, తెలివితేటలు చూపించడానికి చెప్పిన సన్నివేశాలు సిల్లీ అనిపించినా బాగానే కన్వీన్స్ చెయ్యడానికి ప్రయత్నం చేసాడు. అందుకనే “సినిమా బాగుంది” అని కొందరు అంటున్నారు.
ఇది సుకుమార్ సినిమానా? ఎన్.టి.ఆర్ సినిమానా?
ఎన్.టి.ఆర్ కోసం సుకుమార్ చేసిన సినిమా. ఎన్.టి.ఆర్ తన కంఫర్ట్ జోన్‌కు భిన్నంగా మొదలు పెట్టిన జర్నీ(బృందావనం సినిమాతో మొదలైంది)లో ఇదొక సినిమా. ఇరగదీసేసాడు. ప్రేక్షకులు కూడా అలవాటు పడుతున్నారు. 45-50 కోట్లు సాధించడం సామాన్య విషయం కాదు. దమ్ము, రామయ్యా వస్తావయ్యా లాంటి కమర్షియల్ సినిమాలు ప్రయత్మం చేసి ఫ్లాప్ అనిపించుకునే కంటే, ఇటువంటి సినిమాలు తీసి కమర్షియల్‌గా బాగా చెయ్యడం(ఏకగ్రీవంగా బాగుందని అంగీకరించకపొయినా) కచ్చితంగా గొప్పే. హట్సాఫ్ ఎన్.టి.ఆర్.
సుకుమార్ పరిస్థితి ఏమిటి?
సుకుమార్‌కు అల్లు అర్జున్ సపోర్ట్ ఫుల్‌గా వుంది. మహేష్‌బాబు & ఎన్.టి.ఆర్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఎంతలా కనెక్ట్ అయ్యారంటే, ఈ ముగ్గురు, సుకుమార్ కథ రెడీ చెయ్యాలే కాని, కళ్ళు మూసుకొని సినిమా చేస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాదిరి ఎక్కువ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చెయ్యడు కాబట్టి, అసలు ఇబ్బంది వుండదు.
త్రివిక్రమ్‌కు ఖలేజ తర్వాత జులాయి ఎలానో, సుకుమార్‌కు ఒన్ తర్వాత నాన్నకు ప్రేమతో అని చెప్పవచ్చు. సుకుమార్ ప్రేక్షకుల విషయంలో ఇంకా కాంప్రమైజ్ అయ్యి, మన నెటీవిటికి దగ్గరగా సినిమా తీయగల్గితే తన తర్వాత సినిమా “అత్తారింటికి దారేది” లాంటి సినిమా అయ్యే ఛాన్సస్ వున్నాయి.
ఇంకా చెప్పుకోదగ్గ విషయాలు ఏమిటి?
శ్రీమంతుడు సినిమాలోలానే ఈ సినిమాలో కూడా జగపతి బాబు తేలిపొయాడు. టెంపర్‌లో పొసాని రొల్ జగపతి బాబు చేసి వుంటే, ఆ సినిమా రేంజ్ ఇంకా పెరిగేదని జగపతి బాబు అపోహపడుతున్నాడు. ఆ సినిమా రేంజ్ తగ్గేది. సాయి ధర్మ్ తేజ్ చిన్న హిరో అవ్వడంతో పిల్లా నువ్వు లేని జీవితంలో జగపతి బాబు బాగున్నాడు. మహేష్‌బాబు & ఎన్.టి.ఆర్ పక్కన క్లాస్ రోల్స్ లో అసలు సరిపోలేదు.
రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల బాగా చేసారు. అవసరాల కూడా ఒకే.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో ప్రాణం పోసాడు. తన మ్యూజిక్ వలనే అందరి ఎక్సపెటేషన్స్ ఆ రేంజ్‌లో వున్నాయని చెప్పవచ్చు.
Nee bondha ra nee bondha…. Jagapathi Babu acting lo thelipoyada…? Asala nvu em matladuthunnavo neekaina ardham avthundha…?