సరైనోడు – టైటిల్ ఇలా వుందేంటి?

సరైనోడు

సరైనోడు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంతో షూటింగ్ జరుపుకొంటోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై తయారవుతున్న ఈ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ఇప్పటి దాకా ప్రకటించలేదు కానీ, ఎదో ఒక ఆడియో ఫంక్షన్‌లో అల్లు అరవింద్ ఈ టైటిల్ రిజిస్టర్ చేయించాం అని చెప్పడంతో, టైటిల్ సరైనోడు అని ఇప్పటికే మీడియాలో బాగా ప్రచారమవుతోంది. అప్పట్లో టైటిల్ ఇలా వుందేంటి? అని అనుకున్నారు.

సందట్లో సడేమియా, సరైనోడు టైటిల్‌ను అనుకరిస్తూ, అల్లుడు శీను తన తర్వాత సినిమా స్పీడున్నోడు అని టైటిల్ ఎనౌన్స్ చెయ్యడంతో పాటు, ఆడియో కూడా రిలీజ్ అయిపోయి, సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఇప్పుడు ఈ సరైనోడు స్పీడున్నోడు టైటిల్‌ను అనుకరిస్తున్నట్టు వుంది.

సరైనోడు చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ నెల 26న రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదల చేయనున్నారు. విచిత్రం ఏమిటంటే, ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు కూడా ఒక టీజర్ లాగా ప్రీ-లుక్ పోస్టర్‌ను అల్లు అర్జున్ అధికారికంగా సోషల్ మీడియాలో పెట్టారు. తమిళంలో హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగబ్బాయి ఆది పినిశెట్టి (ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర ధరిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. గతంలో బోయపాటి రూపొందించిన మాస్ మసాలా చిత్రాల లానే ఈ సినిమా కూడా మాస్ సైలిలో ఉంటుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ ప్రీ-లుక్ కూడా చేతిలో పెద్ద ఇనుప గుండు లాంటిది పట్టుకొని, అల్లు అర్జున్ కనిపించీ కనిపించకుండా ఉన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా ఈ చిత్రంలో కథానాయికలు. మరో హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.