“రాజకీయాల్లో ఏమి చేసినా తప్పు కాదనో ..” “తప్పులు చేసి, ఇదే బాబు రాజకీయాలు అంటే” అనో అనటం మాములు అయిపోయింది.
చల్లారిపోయిన తెలంగాన అంశాన్ని ఆదిపత్యం & అధికారం కోసం తెరమీదకు తీసుకొచ్చి, తెలుగు వాళ్ళను రెండుగా చేసారు. మన రాజకీయ దరిద్రులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మరో చిచ్చుకు శ్రీకారం చుట్టారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్పు. సున్నితమైన కులం అడ్డుపెట్టుకొని చిచ్చు పెట్టడం ఇంకా తప్పు
ఈ నియోజవర్గం టిక్కెట్టు, ఈ కులం వాడికే ఇవ్వాలి. ఈ కులం వారికి ఇన్ని పదవులు ఇవ్వాలి. ఇది నేటి రాజకీయం. ఇదే దరిద్రం అనుకుంటే, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టి ఆదిపత్యం కోసం, అధికారం కోసం వెంపర్లాడుతున్నారు.
ఈ విషయం మీద ఎవడు నిజం మాట్లాడితే, నిజం మాట్లాడిన వాడికి కులపిచ్చి అంటగట్టి, కులపిచ్చి గ్యాంగ్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నారు.
అందరూ కలిసి అభివృద్ది కోసం కష్టపడవలసిన సమయంలో, ఇలా కులాల కోసం కొట్లాడుకొవడం దారుణం.రాజకీయ దరిద్రులను గుడ్డిగా సపోర్ట్ చేస్తున్న మేధావులను ఎవరూ ఏమి చేయలేకపొయినా, మూల కారకులను దేవుడే శిక్షించాలి.
Jaihind!!!